తెలంగాణ TET హాల్ టికెట్ 2026.. నేడు విడుదల | TG TET Hall Ticket
తెలంగాణలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) హాల్ టికెట్ల విడుదల తేదీలో మార్పు జరిగింది. తొలుత ఆగస్టు 31న హాల్ టికెట్లు విడుదల చేయాల్సి ఉండగా, విడుదలను సెప్టెంబర్ 2కి వాయిదా వేశారు.
నేడు హాల్ టికెట్లు
డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, తెలంగాణ హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్‌ను సెప్టెంబర్ 2న యాక్టివేట్ చేయనుంది. అయితే ఖచ్చితమైన విడుదల సమయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. హాల్ టికెట్‌తో పాటు పరీక్ష రోజున చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
సెప్టెంబర్ 8, 9న పరీక్షలు
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల TG TET పరీక్షలు సెప్టెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 8న పేపర్-1తో పాటు పేపర్-2 మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ పరీక్షలు, సెప్టెంబర్ 9న పేపర్-2 మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలకు మొత్తం 24,983 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు సమాచారం. ఇందులో పేపర్-1కు 5,963 మంది, పేపర్-2కు 19,020 మంది అభ్యర్థులు ఉన్నారు.
అభ్యర్థులు హాల్ టికెట్ విడుదలైన వెంటనే డౌన్లోడ్ చేసుకుని, అందులోని పరీక్ష కేంద్రం, తేదీ, సమయం వంటి వివరాలను ముందుగానే పరిశీలించుకోవడం మంచిది.

Leave a Reply